News February 24, 2026
HYD: 3 కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే!

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT
Similar News
News February 28, 2026
INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

T20WC S-8లో రేపు కోల్‌కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను బాలెన్స్‌డ్‌గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్‌పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్‌ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.
News February 28, 2026
గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబిలో జరిగిన దాడుల్లో పాకిస్థాన్ పౌరుడొకరు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారని, ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
News February 28, 2026
ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.


