News February 24, 2026

2 రోజులు తిరుపతి ఐజర్‌లో కార్యక్రమాలు

image

ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇస్తారు.

Similar News

News March 1, 2026

సంగారెడ్డి: రేపటి నుంచి 10th విద్యార్థులకు పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు-3 నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.

News March 1, 2026

తిరుపతి: ఇవాళ చికెన్ కొంటున్నారా.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.161 నుంచి రూ.165, మాంసం రూ.233 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.266 నుంచి రూ.285 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 1, 2026

చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

image

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.