News February 24, 2026

రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

image

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్‌లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్‌లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

Similar News

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

image

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News February 28, 2026

RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

image

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.