News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.

Similar News

News February 26, 2026

HYD: అడవిలో ఒక రాత్రి.. ఈ ఆదివారం క్యాంప్!

image

ప్రకృతి ప్రేమికులకు మంచిరేవుల పార్క్ అదిరిపోయే ఆఫర్. ​వీకెండ్‌లో కాంక్రీట్ జంగిల్ వదిలి అసలైన అడవిలోకి వెళ్లాలనుందా? మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఈ నెల 28న రాక్ బే నేచర్ క్యాంప్ ఉంది. నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో పాటు మార్చి 1న ఉదయం ‘బర్డ్ వాక్’ సందడి ఉంటుంది. నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు. రూ.1199(పిల్లలు), రూ.1999 (పెద్దలు). బర్డ్ వాక్ ఫీజు రూ.450 మాత్రమే.

News February 26, 2026

HYD: బడా బాబుల ‘కోటల’ గుట్టు రట్టు!

image

మూసీ సుందరీకరణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు గర్జిస్తున్నా 42 బడా సంస్థల విషయంలో యంత్రాంగం మౌనం వహిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. అంబర్‌పేటలోని ఇంజినీరింగ్ కాలేజీలు, అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌లు, నాగోల్‌లోని ఫంక్షన్ హాళ్ల జాబితా సిద్ధమైనా అవి రాజకీయ నేతల బినామీ ఆస్తులు కావడంతో GOVT ఆచితూచి అడుగులేస్తోంది. హైడ్రా మార్కింగ్ చేసినా పెనాల్టీతో రెగ్యులరైజ్ చేసే రహస్య ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.

News February 26, 2026

మాస్టర్ ప్లాన్ 2050.. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ముసుగులో భూదందా!

image

HMDA సిద్ధం చేస్తున్న ‘విజన్ 2050’ మాస్టర్ ప్లాన్ ఇంకా నోటిఫై కాకముందే దానిలోని ‘గ్రీన్ జోన్’, ‘రెసిడెన్షియల్ జోన్’ వివరాలు లీక్ అయ్యాయి. ఏయే ప్రాంతాలు భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయో ముందే తెలుసుకున్న కొందరు అధికారులు, రాజకీయ నేతలు కలిసి చుట్టుపక్కల వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఈ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ విలువ దాదాపు ₹5,000 కోట్లకు పైమాటే.