News May 3, 2024

ఏనుగుల బెడద తప్పిస్తాం: నితిన్ గడ్కరీ

image

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో గురువారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి చినబొండపల్లిలో జరిగన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం జిల్లాలో ఏనుగుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ మొదలగు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News March 9, 2026

VZM: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 107 మందికి రూ.10.70 లక్షల ఫైన్

image

మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10.70 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు విజయనగరం జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

News March 9, 2026

VZM: ‘పనిచేసిన 15 రోజుల్లో‌పే ఖాతాలో వేతనం’

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్-రోజ్‌గార్, ఆజీవిక మిషన్ చట్టంపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 125 రోజుల ఉపాధి పని దినాల కల్పనకు పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామన్నారు. పని చేసిన 15 రోజుల్లోగా వేతనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.

News March 9, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.