News February 24, 2026

పార్వతీపురం: ‘విద్యార్థుల సౌకర్యమే ప్రధానం’

image

వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. మౌలిక వసతులతో పాటు గాలి, వెలుతురు ఉండేలా నిర్మాణాలు ఉండాలన్నారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న వివిధ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు.

Similar News

News February 27, 2026

ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

image

AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్‌సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.

News February 27, 2026

ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

image

మన ఇమ్యూన్‌ సిస్టమ్‌ ఎప్పుడూ వైరస్‌లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.

News February 27, 2026

అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

image

ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇమ్యూన్‌ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్‌) అంతే బలంగా ఉంటాయి.