News February 24, 2026
NGKL: హాల్ టికెట్‌పై సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి: DIEO

ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా విద్యార్థులు ఆందోళన చెందవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) వెంకటరమణ తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు మీసేవ ద్వారా హాల్ టికెట్లు పొంది నిశ్చింతగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
Similar News
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News March 2, 2026
మెండోరా: హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

మెండోరా మండలం పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్‌పల్లి మండలానికి చెందిన నెహ్రూగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు.


