News February 24, 2026
అనకాపల్లి: 219 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు డీఐఈఓ ఎం.వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాల్లో 12,422 మంది హాజరుకావాల్సి ఉండగా 219 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News March 1, 2026
హోలీ వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

హోలీ పండుగను ఆనందంగా, బాధ్యతగా జరుపుకోవాలని ఎస్పీ కె. నరసింహ ప్రజలను కోరారు. బలవంతంగా ఎవరిపై రంగులు చల్లకూడదన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, గుంపులుగా వాహనాలతో తిరిగినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడాలని ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన సూచించారు.
News March 1, 2026
ADB: ఆదర్శం.. ఆ గ్రామంలో కట్న, కానుకలు నిషేధం

సామాజిక మార్పు దిశగా ఇంద్రవెల్లి(M) ప్రధాన్‌గూడ, హీరాసుఖనగర (కొబ్బైగూడ) గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఆదివారం గ్రామ పెద్దలు సమావేశమై శుభకార్యాల్లో కట్న, కానుకలను పూర్తిగా నిషేధిస్తూ చారిత్రక తీర్మానం చేశారు. దీనికి బదులుగా, ఏ ఇంట్లో వేడుక జరిగినా గ్రామంలోని ప్రతి ఇల్లు ₹300 చొప్పున చందా జమ చేసి, ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలవాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి పంచాయతీలో సుమారు 500 మంది ఓటర్లున్నారు.
News March 1, 2026
రేపల్లె డీఎస్పీ హెచ్చరిక

దీపావళి పండుగ నేపథ్యంలో నిల్వ ఉన్న టపాసులు, మందుగుండు సామగ్రిని తక్షణమే ప్రభుత్వ అనుమతి పొందిన గోదాములకు అప్పగించాలని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని 9 మండలాల ప్రజలు, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.


