News February 24, 2026
TU: తెలుగు అధ్యయన శాఖ బోర్డర్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.
Similar News
News March 2, 2026
T20WC: టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్

భారత జట్టు సెమీస్‌కు చేరినా ఫీల్డింగ్ కలవరపెడుతోంది. నిన్న WIతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ 3 క్యాచులు వదిలేసింది. ఈ WCలో ఇప్పటి వరకు 13 క్యాచులను నేలపాలు(71.7% ఎఫిషియెన్సీ) చేసింది. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక(11) ఉంది. నిన్న మ్యాచ్ విన్ కావడంతో దీనిపై పెద్దగా చర్చ జరగలేదని క్రీడావర్గాలు అంటున్నాయి. రానున్న మ్యాచుల్లో ఇదే కంటిన్యూ అయితే వరల్డ్ కప్ సాధించాలనే ఆశలు వదులుకోవాల్సిందే అని చెబుతున్నారు.
News March 2, 2026
గద్వాల జిల్లాలో రెండు నెలల్లో 14 పోక్సో కేసులు!

గద్వాల జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేయాలని పోలీసులు సూచించారు.
News March 2, 2026
వరంగల్: తండ్రి ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య

తండ్రి ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ CI రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కలహంది మండలానికి చెందిన భారత్ ఉరుసు శివారు అమ్మవారిపేట ఇటుక బట్టీలలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. తండ్రిని మూడో కుమార్తె(15) ఫోన్ అడగ్గా తర్వాత కొనిస్తానని చెప్పాడు. మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కేసు నమోదైంది.


