News February 24, 2026

MNCL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమలు

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం వరకు భద్రత కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News March 1, 2026

రేపు HYDకి రాహుల్ గాంధీ

image

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనంతా పటిష్ఠమైన భద్రతా చర్యల నడుమ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

News March 1, 2026

భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే!

image

భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కళ్యాణానికి ప్రత్యక్షంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ డిపో మేనేజర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్ లోని 9959226302 నంబర్‌ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 1, 2026

నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.