News February 24, 2026
HNK: సమీక్షలో పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడి

ఇంటర్మీడియట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పక్కడ్బందీ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి, డా యోగితా రాణా, కృష్ణ ఆదిత్య, నికోలస్ తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లలతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరిధిలో పరీక్ష కేంద్రాలు, అభ్యర్థుల వివరాలను, తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ స్నేహ శబరీష్ వివరించారు.
Similar News
News March 3, 2026
తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT
News March 3, 2026
WGL: దట్టమైన అడవుల్లో జింకలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించి చెబుతున్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
News March 3, 2026
రేపు ఆన్‌లైన్ క్విజ్: డీఈవో నాగేశ్వరరావు

జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డీఈఓ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతిభ కనబరిచిన ఆరు టీములు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ఫైనల్స్‌కు ఎంపికవుతాయని ఆయన వెల్లడించారు.


