News February 24, 2026
అష్టావక్రుడి గురించి మీకు తెలుసా?

అష్టావక్రుడంటే 8 వంకరలు ఉన్నవాడు. ఉద్దాలకుని శిష్యుడైన కహోలుని కుమారుడు ఆయన. తండ్రి వేద పఠనంలోని దోషాలను గర్భం నుంచే సరిదిద్దారు. అందువల్ల శాపగ్రస్థుడై 8 వంకరలతో జన్మించాడు. 12 ఏళ్లకే వేద పండితుడై తన తండ్రిని గతంలో ఓడించిన పండితులను వాదనలో ఓడించాడు. ‘జ్ఞానమే వృద్ధాప్యానికి కొలమానం. కానీ వయస్సు కాదు’ అని నిరూపించాడు. రూపం, వయస్సు, వంశాన్ని బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని చాటిచెప్పారు.
Similar News
News February 28, 2026
కాలసర్ప దోషం పోవాలంటే?

కాలసర్ప దోష నివారణకు సోమవారం నల్ల నువ్వులతో శివాభిషేకం, మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘నాగపంచమి నాడు నాగేంద్రుని పూజించాలి. వెండి పాముల జతను నదిలో వదిలితే దోష తీవ్రత తగ్గుతుంది. శనివారం రావిచెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయాలి. నాసిక్‌లో శాంతి పూజలు నిర్వహించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి’ అని అంటున్నారు.
News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
News February 28, 2026
ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

TG: గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో <<19260855>>HPV వ్యాక్సినేషన్<<>> డ్రైవ్ ప్రారంభమైంది. నేటి నుంచి 3 నెలల పాటు 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేస్తారు. మొదటి నెల రోజులు గవర్నమెంట్ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత PHCలలోనూ అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకా డోసు ధర ₹3k-4k ఉంటుందని పేర్కొన్నారు.


