News February 24, 2026
182 గ్రామాల్లో 7.95 లక్షల పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

ఏలూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 182 గ్రామాల్లో ఇప్పటివరకు 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మార్చిలో మరో 10 గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరిన్ని గ్రామాల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2026
మన్యం: 3 రోజుల క్రితమే వచ్చి అంతలోనే మృత్యవాత.. జవాన్ వివరాలివే

జియ్యమ్మవలస(M) శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దవలసింగి చంద్రమౌళి(29) గిజబ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామస్థుల వివరాలు మేరకు మృతుడు.. గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం వివాహమైందని భార్య, సంవత్సరం వయస్సున్న పాప ఉన్నారన్నారు.
News February 26, 2026
శ్రీశైలంలో అగ్నిప్రమాదాలు.. ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఎక్కడ?

శ్రీశైల దేవస్థానం పరిధిలోని కాటేజీలు, నిత్య అన్నదాన సత్రాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతనెల 21న, నేడు జరిగిన అగ్నిప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఫైర్ ఎక్విప్‌మెంట్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గించవచ్చని భక్తులు చెబుతున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, సత్రాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News February 26, 2026
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in


