News May 3, 2024

స్మృతీపై పోటీ.. ఎవరీ కిషోరీ లాల్ శర్మ?

image

అమేథీలో కేంద్రమంత్రి, BJP అభ్యర్థి స్మృతీ ఇరానీకి పోటీగా కిషోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. 4దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న కిషోరీ.. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన స్వస్థలం పంజాబ్‌లోని లుథియానా. సోనియా గాంధీ అందుబాటులో లేనప్పుడు రాయ్ బరేలీతో పాటు రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీ నియోజకవర్గాన్ని సైతం శర్మ పర్యవేక్షిస్తుంటారు. అప్పుడప్పుడు పర్యటనలు చేస్తుంటారు.

Similar News

News March 13, 2026

క్యాబినెట్ భేటీ.. ప్రతిపాదనలు ఇవే..

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రూ.119 కోట్ల ఖర్చుతో తెలుగు కల్చరల్ సెంటర్, సచివాలయం, HoD టవర్ల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. వ్యవసాయం, పరిశ్రమలు, జలవనరులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

News March 13, 2026

జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎస్సై పోస్ట్.. అసలేంటీ వివాదం?

image

TG: విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. SI పోస్టును జోనల్ స్థాయికి కేటాయించారు. ఏ జోన్‌కైతే ఎంపికైతారో అక్కడే సర్వీస్‌తో పాటు ప్రమోషన్లు ఉంటాయి. దీంతో ఆ జోన్‌లోని ఖాళీలను బట్టి ఒకే బ్యాచ్ SIలకు త్వరగా ప్రమోషన్లు వచ్చాయి. దీంతో వివాదం మొదలైంది. దీనికి తెరదించుతూ SI పోస్టును రాష్ట్రస్థాయికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు.

News March 13, 2026

రాష్ట్రంలో 17,992 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

TG: రాష్ట్ర హోంశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 17,992 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే ఎస్సై పోస్టును జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించారు.