News February 24, 2026
జగిత్యాల: అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం మామిడి, మొక్కజొన్న రైతులను దెబ్బతీసింది. రాయికల్ మండలంలోని రామాజీపేటతో పాటు జగిత్యాల గ్రామీణ, సారంగాపూర్ మండలాల్లో మామిడి పిందెలు నేలరాలగా, మొక్కజొన్న పంట నేలవాలింది. ఏళ్ల కష్టమంతా కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Similar News
News March 3, 2026
నెల్లూరు: 15 పోస్టుల్లో 6 ఖాళీ..!

నెల్లూరు జిల్లాలో 110KM విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. 53,541మంది మత్స్యకారులు ఉండగా.. 39,590 ఎకరాల ఆక్వా సాగులో ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మత్స్యశాఖలో 15 పోస్టులే ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 8మందికి 4 ఖాళీలు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫిషరీస్ 4 పోస్టులకు 2ఖాళీలు ఉన్నాయి. దీంతో సాగరమిత్రలపై పనిభారం పెరుగుతోందని సమాచారం. వీరికి గత 4నెలలుగా జీతాలు కూడా సరిగా రావడం లేదని తెలుస్తోంది.
News March 3, 2026
సీఎంతో సమీక్షలో పాల్గొన్న ములుగు కలెక్టర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాల పురోగతిని సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్య, మధ్యాహ్న భోజన పథకాలపై కలెక్టర్లతో చర్చించినట్లు సమాచారం.
News March 3, 2026
వరంగల్ NITతో పరస్పర ఒపందం

నీటి వనరులు, జియోస్పేషియల్ శాస్త్రాల రంగంలో పరిశోధన సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌ఐటీ వరంగల్, సర్వే ఆఫ్ ఇండియా–జాతీయ జియో-ఇన్ఫర్మాటిక్స్ సైన్స్ & టెక్నాలజీ సంస్థ మధ్యలో పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, ఎన్‌ఐజీఎస్టీ, సర్వే ఆఫ్ ఇండియా హెడ్, అదనపు సర్వేయర్ జనరల్ జి.వరుణ్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


