News February 24, 2026

చలాన్ కట్టే బదులు.. హెల్మెట్ పెట్టుకోండి: రామగుండం సీపీ

image

రోడ్డు భద్రతే లక్ష్యంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి చలాన్లకు బదులు హెల్మెట్లు పంపిణీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీలు రమేష్, శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, SIలు రమేష్, హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చలాన్ల కంటే మీ ప్రాణాలే మాకు ముఖ్యమన్నారు.

Similar News

News March 1, 2026

మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

image

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ ఇతర రాష్ట్రాల వారికేనట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 1, 2026

సిద్దిపేట: ప్రేమను నిరాకరించడంతో బాలిక సూసైడ్!

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రేమ వ్యవహారం ఓ బాలిక ప్రాణం తీసింది. యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక FEB 23న పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2026

దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

image

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.