News February 24, 2026

హన్మకొండ జిల్లాలో 38 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

image

హన్మకొండ జిల్లాలో జనవరిలో నిర్వహించిన రోడ్డు భద్రతావారోత్సవాల్లో భాగంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన 38 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు హన్మకొండ ఆర్టీఓ అధికారులు మంగళవారం తెలిపారు. అధిక లోడ్‌తో వెళ్తున్న ఓ వాహన డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.

News February 27, 2026

133 మంది తాలిబన్ ఫైటర్లను చంపేశాం: పాక్

image

తమతో <<19250927>>యుద్ధానికి<<>> దిగిన 133 మంది అఫ్గాన్ ఫైటర్లను చంపేసినట్లు PAK సమాచారశాఖ మంత్రి అతవుల్లా తరార్ తెలిపారు. 200 మందికి పైగా గాయాలైనట్లు వివరించారు. దీన్ని AFG ప్రభుత్వం ఖండించింది. తమ ఫైటర్లు 8 మందే చనిపోయారని, 11 మంది గాయపడినట్లు వెల్లడించింది. తాము 55 మంది PAK సైనికులను చంపేశామని, 2 మిలిటరీ బేస్‌లను, 19 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామంది. అయితే తమ సైనికులు ఇద్దరే చనిపోయినట్లు పాక్ చెబుతోంది.

News February 27, 2026

మార్చిలో తిరుమలలో విశేష పర్వదినాలు

image

☞ మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి ☞ 3న కుమారధార తీర్థ ముక్కోటి, చంద్ర గ్రహణం కారణంగా ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత ☞ 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ☞ 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ☞28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ☞30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.