News May 3, 2024
నితీశ్ నా ఫేవరెట్ ప్లేయర్‌గా మారుతున్నారు: వాట్సన్

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో SRH జట్టును తెలుగు ఆటగాడు నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌లో అతడు తన ఫేవరెట్ ఆటగాడిగా మారుతున్నారని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ‘ఇంత చిన్నవయసులో ఒత్తిడిలో కూడా చాహల్, అశ్విన్ లాంటివారిపై ఆధిపత్యం చెలాయించడం చిన్న విషయం కాదు. నితీశ్ చాలా నాణ్యమైన షాట్స్ ఆడారు. కచ్చితంగా ప్రత్యేకమైన ఆటగాడు’ అని కొనియాడారు.
Similar News
News March 12, 2026
సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


