News February 24, 2026

వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.

Similar News

News February 26, 2026

జనగామ: ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. జిల్లాలో మొత్తం 4,394 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, ఇందుకోసం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.

News February 26, 2026

ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్త బదిలీ

image

రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్తను ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారిగా ఖుష్బూ గుప్త మహిళ స్వయం సంఘాల అభివృద్ధి ఉపాధి కల్పన తదితర అంశాలపై జాతీయస్థాయిలో అవార్డును సైతం పొందారు. అనంతరం వ్యక్తిగత సెలవులపై వెళ్లిన పిఓ స్థానంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పిఓ వ్యవహరిస్తున్నారు..

News February 26, 2026

వరంగల్: IASల బదిలీ.. ఖాళీగానే ‘కీలక’ పోస్టులు..!

image

ఉమ్మడి జిల్లాలో కీలక అధికారిక పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్ర కరీంనగర్ కలెక్టర్‌గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు GWMC కమిషనర్‌గా రెగ్యులర్ అధికారిని నియమించకుండా, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. జనగామ అదనపు కలెక్టర్ స్థానం సైతం ఖాళీ అయ్యింది.