News May 3, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
News September 15, 2025
USలో లక్షల జీతం వద్దనుకుని.. నెల్లూరు SPగా

USలో లక్షల డాలర్ల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను AP, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. అనంతరం USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు.అది నచ్చక సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డీ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
News September 14, 2025
పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.