News February 24, 2026
NRPT: ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలపై సీఎస్ సమీక్ష..!

రాష్ట్రంలో SSC, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.
Similar News
News February 26, 2026
తిరుమల ఘాట్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు బైకుపై కొండ దిగడానికి ప్రయత్నించారు. 30వ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. నటరాజన్ అనే వ్యక్తి చనిపోగా.. మురళీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2026
ఖమ్మం: ఉపసర్పంచ్ పదవికి సర్పంచ్ భార్య రాజీనామా

తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం ఉపసర్పంచ్ కుంభం యమున తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భర్త ఉపేందర్ సర్పంచ్‌గా, భార్య యమున ఉపసర్పంచ్‌గా ఎన్నికై భార్యాభర్తలు గ్రామాన్ని ఏలుతూ వార్తల్లో నిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం మూడు నెలలకే రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.
News February 26, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.


