News May 3, 2024
వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్: షర్మిల

AP: పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి నెలా కొంతమందిని చంపాలని టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను YCP వంచించింది. వారికి రూ.22 వేల కోట్లు బకాయిపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఆదుకుంటుంది. వారు బానిసలుగా పని చేయాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 30, 2026
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
News March 30, 2026
జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయింది: టీడీపీ

AP: మూలపేట <<19518755>>పోర్టును<<>> 70% తానే పూర్తి చేసినట్లు జగన్ చెప్పుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయిందని ట్వీట్ చేసింది. ‘నిజానికి అది భావనపాడు పోర్టు. దాని పనులు అంతకుముందు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. YCP హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు’ అని మండిపడింది.
News March 30, 2026
BREAKING: వైభవ్ విధ్వంసం

చెన్నైతో మ్యాచ్‌లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.


