News February 25, 2026
గుంటూరు: ‘27న సత్యం, న్యాయాన్ని సమాధి చేస్తున్నారు’

తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా స్పందించారు. ఆయేషా మీరా శరీర అవశేషాలను ఈనెల 27న తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లుగా పోరాడుతున్నప్పటికి తమ బిడ్డకు న్యాయం జరగలేదన్నారు. సత్యం, న్యాయం, ధర్మాన్ని 27న సమాధి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 25, 2026
FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.
News February 25, 2026
జులైకి నల్లమల సాగర్ పూర్తి చేస్తాం: CBN

AP: 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణా డెల్టా నుంచి నల్లమల సాగర్‌కు తీసుకొస్తాం. జులైకి నల్లమల సాగర్‌ను పూర్తి చేస్తాం’ అని మార్కాపురం సభలో ప్రకటించారు.
News February 25, 2026
ఇందూరు: ఇంటర్ పరీక్షలకు 576 మంది గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు.


