News May 3, 2024
ప్రియాంక అందుకే పోటీకి ఒప్పుకోలేదా?

రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలన్న ఖర్గే సూచనను ప్రియాంక గాంధీ తిరస్కరించారు. గాంధీ కుటుంబానిది వారసత్వ రాజకీయాలంటూ ఎప్పటినుంచో బీజేపీ విమర్శలు చేస్తూ వస్తోంది. దీంతో ఇప్పటికే తల్లి సోనియా, సోదరుడు రాహుల్ ఎంపీలుగా ఉండగా తానూ గెలిచి పార్లమెంట్‌కు వెళ్తే ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని ఆమె చెప్పినట్లు సమాచారం. అందుకే పోటీ చేయబోనని స్పష్టం చేశారట ప్రియాంక.
Similar News
News March 3, 2026
సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.
News March 3, 2026
ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM

TG: అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3L మంది అనర్హులను తొలగించగలిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.
News March 3, 2026
ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీళ్లు!

AP: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల మంచి నీటిని అందించాలని అధికారులను CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ వీరిద్దరూ ఉండవల్లిలో 2 గంటలు <<19287163>>భేటీ అయ్యారు<<>>. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను CBNకు పవన్ తెలియజేశారు. స్థానిక ఎన్నికలు, TTD వివాదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై చర్చించినట్లు సమాచారం.


