News May 3, 2024

HYDను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర: హరీశ్ రావు

image

TG: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. BRS అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 30, 2026

TMC or BJP: బెంగాల్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే?

image

ఇప్పటికిప్పుడు LS ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో TMC 28, BJP 14 స్థానాల్లో గెలుస్తాయని ‘India Today’ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2024 ఎలక్షన్స్‌లో TMC 29, BJP 12 సీట్లు గెలిచాయి. అయితే గతేడాది AUG సర్వేలో TMC 31, BJPకి 11 సీట్లు రాగా ఇప్పుడు కమలం పార్టీకి మెజార్టీ పెరగడం గమనార్హం. అదే సమయంలో TMC సీట్లు తగ్గాయి. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం కానుంది.

News January 30, 2026

కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 30, 2026

భారీగా తగ్గిన బంగారం ధర

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.7,550 పతనమై రూ.1,56,400 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.