News February 25, 2026
ప్రొద్దుటూరు: అటవీ పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అటవీ, తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 28, 2026
అక్రమ గల్ఫ్ ఏజెంట్లపై కడప ఎస్పీ కొరడా

మహిళలను టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ పంపి మోసగిస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు కేవలం రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి అన్నారు. గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్నవారు ‘Madad’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దళారుల సమాచారం తెలిస్తే 9121100504, 9121100652 నంబర్లకు తెలపాలన్నారు.
News February 28, 2026
’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.
News February 28, 2026
సిద్ధవటంలో చిరుత సంచారం

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.


