News May 3, 2024

సిరికొండ: మంటలంటుకుని రైతు మృతి

image

ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని పెదవాల్గోట్ గ్రామానికి చెందిన లాయిడి కిషన్(58) పోత్నూర్ గ్రామ శివారులోని తన పంట పొలం వరి కంకులకు నిప్పు పట్టాడు. ఈ క్రమంలో మంటలంటుకుని కిషన్ మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 20, 2026

NZB: అంతరిస్తోన్న పిచ్చుకల కోసం ఫీడర్లు

image

ఒకప్పుడు మన ఇంటి ముంగిట సందడి చేసిన పిచ్చుకలు నేడు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని సంరక్షించాలన్న ఉద్దేశంతో నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు Md దిలావర్ కృషితో 2010లో మొదటి సారిగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. NZBకు చెందిన మంచాల జ్ఞానేందర్ పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెట్టేలా ఫీడర్లు పంపిణీ చేస్తున్నారు.

News March 20, 2026

నిజామాబాద్: ఆరుతున్న సామాన్యుడి పొయ్యి!

image

​యుద్ధం ఎక్కడో జరుగుతుండవచ్చు, కానీ దాని సెగ ఉమ్మడి నిజామాబాద్‌లోని సామాన్యుడి వంటింట్లో కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం సాకుతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన జాప్యం, ఇక్కడి పేదవాడి కడుపు కొడుతోంది. ​గత 30 రోజుల్లో అధికారులు 156 సిలిండర్లను పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్మూర్, బోధన్ వంటి ప్రాంతాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సబ్సిడీ గ్యాస్‌ను వాడుతూ పట్టుబడ్డారు.

News March 20, 2026

NZB: విచారణ పూర్తి.. ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత: DEO

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి ఈ రోజు విచారణ పూర్తి అయ్యిందని DEOఅశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏ. శివానంద్ రావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DEO తెలిపారు