News May 3, 2024
పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?: చంద్రబాబు

AP: ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాల మీద జగన్ ఫొటో ఎందుకు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయనేమైనా ప్రజల వారసుడా? అని అన్నారు. ‘ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని, హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి? అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరం. ప్రజలు ఇది గ్రహించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Similar News
News November 8, 2025
రబీ శనగ సాగుకు అనువైన రకాలు

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్‌బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)
News November 8, 2025
గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.
News November 8, 2025
ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


