News February 25, 2026

ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

image

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 1, 2026

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్‌‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.

News March 1, 2026

విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI

image

AP: మధ్యవర్తిత్వం వహించేవారిపై ఇరుపార్టీలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే వారి మధ్య ఏర్పడ్డ న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయని CJI జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో ‘మధ్యవర్తిత్వం’పై జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్బిట్రేటర్ల నియామకమూ అలాగే ఉండాలన్నారు. సమస్య పరిష్కారానికి పార్టీల మధ్య జరిగిన ఒప్పందాలను వేగంగా, సక్రమంగా అమలు చేసేలా యంత్రాంగమూ ఉండాలని పేర్కొన్నారు.

News March 1, 2026

పెరిగిన జీఎస్టీ వసూళ్లు

image

AP: రాష్ట్రంలో గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూలు గతంలో కన్నా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం GST-2.0లో పలు వస్తువులపై ట్యాక్సుల భారాన్ని తగ్గించినా రాబడిలో పురోగతి నమోదైంది. 2026 FEBలో నెట్ వసూలు ₹3061 CR కాగా గ్రాస్ ₹3562 CRవసూలు అయ్యింది. అదే 2025 FEBలో నెట్ ₹2902CR కాగా గ్రాస్ ₹3569CRగా ఉంది. సెస్‌తో సంబంధం లేకుండా గ్రాస్ వసూళ్లు తగ్గినా నెట్ వసూళ్లలో మాత్రం ₹150 CR పెరుగుదల కనిపించింది.