News February 25, 2026

NGKL: ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్ ALL THE BEST

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్క ఎగ్జామ్‌ రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

Similar News

News February 28, 2026

NPDCL చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

image

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదయిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

News February 28, 2026

AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

image

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.

News February 28, 2026

వరంగల్: హెల్మెట్ తలకు భారమా?

image

వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకుండా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్యాషన్‌ కోసం ప్రాణాలను పణంగా పెడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్‌ లేని ప్రయాణం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నా మార్పు రావట్లేదు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.