News May 3, 2024

సింహపురి నుంచి ఢిల్లీ వెళ్లేది ఎవరో..!

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన సింహపురిలో రసవత్తర పోటీ జరుగుతోంది. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి విజయసాయిరెడ్డి(వైసీపీ), వీపీఆర్(టీడీపీ), రాజు(కాంగ్రెస్) పోటీపడుతున్నారు. నెల్లూరు అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో వీఎస్ఆర్, మాస్టర్ ప్లాన్‌తో వీపీఆర్, గతంలో చేసిన మంచి పనులతో రాజు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సింహపురి ప్రజలు ఎవరిని ఢిల్లీకి పంపుతారో చూడాలి మరి.

Similar News

News January 8, 2026

నెల్లూరు: పథకాలు ఉన్నా.. అందడం లేదు!

image

మత్స్యశాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు. రాష్ట్ర పథకాలు నిలిచిపోగా.. కేంద్ర పథకాలు ఉన్నా అమలు కావడం లేదు. నెల్లూరు జిల్లాలో 25 రకాల సబ్సిడీ పథకాల కింద 10,195 యూనిట్స్ కేటాయించారు. కేవలం 359 యూనిట్లు మంజూరు కాగా.. 9,835 యూనిట్లు మిగిలిపోయాయి. పథకాలపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఈ శాఖపై త్వరలో కలెక్టర్ రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

News January 8, 2026

సూళ్లూరుపేట: పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్‌!

image

సూళ్లూరుపేట :ఫ్లెమింగో పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేలపట్టు, పులికాట్‌లో సందడి చేస్తున్నాయి. పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. 2016లో పర్యాటక శాఖ రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించింది.

News January 8, 2026

నెల్లూరు జిల్లాలో లైసెన్సులు లేకుండానే..!

image

నెల్లూరు జిల్లాలో 165 kM మేర సముద్ర తీరం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇస్కపాలెం, మైపాడు, కృష్ణపట్నం తదితర చోట్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుండగా.. వాటికి మత్స్యశాఖ నుంచి లైసెన్సులు లేవు. అధికారికంగా 23వేల ఎకరాలే సాగు ఉండగా.. అనధికార చెరువులకు సైతం కరెంటు వాడుతున్నారు. మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు లైసెన్సులను చెక్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.