News February 25, 2026
HNK: సందేహాలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్లు

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడైనా విద్యార్థులు ఆందోళనకు గురై మానసిక సమస్యలు ఎదురైతే వెంటనే 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని హనుమకొండ జిల్లా డీఐఈవో గోపాల్ సూచించారు. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు ఉంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. సకాలానికి విద్యార్థులు సెంటర్లకు చేరుకొని ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలన్నారు.
Similar News
News February 27, 2026
‘VIROSH’ పెళ్లి ఫొటోలకు 12 గంటల్లో 2.6కోట్ల లైక్స్!

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం నిన్న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ పోస్ట్‌కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ల లైక్స్ రాగా రష్మిక పోస్ట్ 14 మిలియన్ల లైక్స్‌తో రికార్డు సృష్టించింది. ‘VIROSH’ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇది వీరికున్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.
News February 27, 2026
అర్హులైన ప్రతి బాధితుడికీ న్యాయం చేస్తాం: మంత్రి తుమ్మల

ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అసలైన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. భూదాన్ స్థలాలను మోసపూరితంగా విక్రయించిన అక్రమార్కులను ఉపేక్షించేది లేదని, వారు జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
News February 27, 2026
చంద్రగ్రహణం: మార్చి 3న శ్రీశైల ఆలయం మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే అలంకార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6 గంటలకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. సాయంత్రం 7:30కు తిరిగి తెరిచి సంప్రోక్షణ నిర్వహించి, రాత్రి 9 నుంచి 10:30 వరకు భక్తులకు అలంకార దర్శనం కల్పిస్తామని వివరించారు.


