News February 25, 2026
మా రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా ఎందుకు మార్చట్లేదు: మమత

కేరళ పేరును <<19227139>>కేరళంగా<<>> మార్చడాన్ని WB సీఎం మమత స్వాగతించారు. తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్రానికి 3సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ కల్చర్‌ను పరిగణనలోకి తీసుకొని ‘బంగ్లా’ పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. ‘మా విద్యార్థులు పరీక్షకు వెళితే అక్షర క్రమంలో(West Bengal) చివర్లో కూర్చోవాలి. CMగా నాకూ ఇదే పరిస్థితి. మేమెందుకు చివర్లోనే ఉండాలి’ అని ప్రశ్నించారు.
Similar News
News February 27, 2026
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రింకూ హుటాహుటిన సొంతూరుకు బయలుదేరారు. కొన్ని రోజులుగా ఖచంద్ర లివర్ క్యాన్సర్(ఫోర్త్ స్టేజ్)తో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసి 3 రోజుల కిందటే రింకూ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న మ్యాచ్ సమయానికి మళ్లీ తిరిగి జట్టుతో చేరినా ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు.
News February 27, 2026
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News February 27, 2026
SEBIలో 91 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


