News February 25, 2026
తిరుపతి: లవర్‌తో పెళ్లి కోసం కూతురినే చంపేసింది!

తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత(19) భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గ(3)తో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు ఈనెల 19నుంచి కనబడటం లేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగు చూసింది.
Similar News
News March 1, 2026
హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.
News March 1, 2026
హోలీ.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. Rail One యాప్ ద్వారా వీటికి సంబంధించిన వివరాలను చూసుకునే వెసులుబాటును కల్పించినట్లుగా తెలిపారు.


