News May 3, 2024
విజయనగరం గ్రామ సంస్థానికి 1937లో తొలిసారి ఎన్నికలు

జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937 ఫిబ్రవరి 9న తొలిసారి విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. విజయనగరం సంస్థానాదీశులు మీర్జా రాజా పూసపాటి అలకనారాయణ గజపతి మహారాజు నీలిరంగు పెట్టె గుర్తుతో బరిలో దిగారు. అప్పట్లో ఆయన్ను గెలిపించాలని కోరుతూ విజయనగరం సంస్థాన మార్‌గుజారీమాన్యమ్ ఇనాందార్లు కట్టోజు పెద్దగంగరాజు, జి.వీర్రాజునాయుడు పంచిన కరపత్రాన్ని మనం పై ఫొటోలో చూడొచ్చు.
Similar News
News March 19, 2026
ఉగాది పురస్కారం అందుకున్న నీలబోను సత్యం

తప్పేటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం ఉగాది పురస్కారం అవార్డు అందుకున్నారు. అమరావతిలో గురువారం జరిగిన ఉగాది పురస్కారం వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. దీంతో సత్యంను ఎమ్మెల్యే బేబినాయన అభినందించారు. తప్పేటగుళ్ల ప్రదర్శనలో ఉగాది పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సత్యం తెలిపారు.
News March 19, 2026
VZM: 55 సిలిండర్లు స్వాధీనం..19 మందిపై కేసులు

విజయనగరం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాధ్ గురువారం తెలిపారు. సరఫరాపై కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అనధికార నిల్వలపై చేపట్టిన తనిఖీల్లో ఈవారం 55 సిలిండర్లు స్వాధీనం చేసుకొని, 19 మందిపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News March 19, 2026
VZM: ఆ గ్రామంలో 24న ఉగాది వేడుకలు

విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో నేడు ఉగాది పండగను జరుపుకోరు. వివరాల్లోకి వెలితే.. బాడంగి మండలం గజరాయునివలస గ్రామదేవత బంగారమ్మ. అమ్మవారి జన్మ నక్షత్రం ఆధారంగా ముహూర్తం తీసి ఉగాదిని జరుపుకుంటారు. పూర్వం నుంచి ఈ ఆచారం వస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా.. 24న తెల్లవారుజామున 3.45 గంటలకు ఏరువాక నిర్వహించి అదే రోజు ఉగాది జరుపుకునేందుకు పురోహితుడు కె.రామకృష్ణ ముహూర్తం పెట్టారు.


