News February 25, 2026

‘దేవాదుల’ కెపాసిటీని 100TMCలకు పెంచండి: సీఎం రేవంత్

image

TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం కెపాసిటీని భవిష్యత్తులో 100 TMCలకు పెంచేందుకు కసరత్తు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38TMCల సామర్థ్యంతో 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ₹14,359Crను ఖర్చు చేశారు. దేవాదులతో హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, ములుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News March 2, 2026

HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా?.. కేంద్రం క్లారిటీ

image

ఫ్రీ HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ టీకా కొత్తది కాదని 2006 నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. 2022 చివరి నాటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని, అనేక స్టడీలు ఇది సురక్షితమని తేల్చాయని వెల్లడించింది. 14 ఏళ్లలోపు బాలికలకు అందించే టీకా గర్భాశయ క్యాన్సర్ నుంచి 93-100% రక్షణ కల్పిస్తుందని తెలిపింది.

News March 2, 2026

వంటింటి చిట్కాలు.. ఈ పురుగులు చిరాకు తెప్పిస్తున్నాయా?

image

తడికి ఆకర్షితమయ్యే ఈ పురుగుల పేరు ‘ఫ్రూట్ ఫ్లైస్’. వంటగదిలో ఇవి చిరాకు తెప్పిస్తాయి. ఫ్లోర్, టేబుల్స్, సెల్ఫ్‌లపై ఎలాంటి పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు చిల్లినా వస్తాయి. తడి చెత్త డబ్బా మంచి ఆవాస స్థానం. వీటి నివారణకు వంటగదిని పొడిగా ఉంచాలి. గిన్నెలు తోమిన తర్వాత తుడవాలి. కుళ్లిన పదార్థాలు వంటగదిలో ఉంచొద్దు. డస్ట్‌బిన్‌ రోజూ క్లియర్ చేయాలి. పండ్లు, కూరగాయలను మూత ఉన్న పాత్రలు, ఫ్రిజ్‌లో పెట్టాలి.

News March 2, 2026

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఫెడరల్ బ్యాంక్‌లో అసోసియేట్ ఆఫీసర్(సేల్స్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి జీతం రూ.4.64లక్షలు-రూ.6.70లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.federal.bank.in