News February 25, 2026
నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయనున్న ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ప్రభాస్ స్వయంగా స్పందించి ఆ సంస్థకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించుకుంటానని చెప్పారట. స్పిరిట్, ఫౌజీ చిత్రాలు పూర్తయ్యాక 2027లో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.
Similar News
News February 28, 2026
ఇరాన్‌తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

మిడిల్ ఈస్ట్‌లోని సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతిస్తున్నాయి. ఇక వెస్ట్రర్న్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తీవ్రంగా తప్పుబడుతూ US వైపు నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరుదేశాలకు మద్దతుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News February 28, 2026
అమెరికాతో ఢీ.. ఇరాన్‌కు ఎందుకింత ధైర్యం?

మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న US, ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ ఆయుధ సంపత్తితో పాటు మిత్రపక్షాల బలమే దీనికి కారణం. హమాస్, హెజ్బోల్లా, హౌతీ, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌తో పాటు ఇరాక్‌లోని కొన్ని గ్రూపులూ మద్దతు ఇస్తున్నాయి. రష్యా, చైనా కూడా ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇక ఆసియాలో ఇరాన్‌కు పాక్ మిత్రదేశంగా ఉంది. కానీ USను ఎదురించి ఆ దేశానికి మద్దతిచ్చే ధైర్యం పాక్‌కు లేదు.
News February 28, 2026
ఇండియాలోనే ఎత్తైన కుటుంబాన్ని చూశారా?

సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒకే ఎత్తులో ఉండటం అరుదు. కానీ పుణేకు(MH) చెందిన కులకర్ణి కుటుంబంలోని నలుగురూ ఆజానుబాహులే. తండ్రి శరద్ (7.2ft), తల్లి సంజ్యోత్ (6.3ft), కుమార్తెలు మృగ (6.2ft), సానియా 6.4ft ఉండటంతో ఈ కుటుంబం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వీరి ఎత్తుకు తగ్గట్టుగా ఇంట్లోని తలుపులను 8 అడుగుల మేర రూపొందించుకున్నారు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


