News February 25, 2026

SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

<>SBI <<>>12 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech, BE, MCA, MTech, MSc(CS)ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News March 3, 2026

ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

image

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.

News March 3, 2026

ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

image

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.

News March 3, 2026

సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.