News February 25, 2026

పునర్విక చికిత్సకు రూ.50 లక్షలు: MP బైరెడ్డి శబరి

image

కర్నూలు (D) వెల్దుర్తికి చెందిన చిన్నారి <<19232308>>పునర్విక<<>> చికిత్స కోసం కేంద్ర ఆరోగ్యశాఖ రూ.50 లక్షల సాయం చేసిందని MP బైరెడ్డి శబరి తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సమస్యను తండ్రి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా NPRD పథకం నుంచి నిధులు విడుదలయ్యాయని అన్నారు. సహకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Similar News

News February 28, 2026

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 7,791 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 7,958 మందికి గాను 167 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన వివరించారు. నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

News February 28, 2026

మార్చి 2న కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

మార్చి 2న ఉదయం 9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News February 28, 2026

కామారెడ్డి: 98.11 శాతం ఇంటర్ హాజరు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 7,840 మంది విద్యార్థులకు గాను 7,692 మంది హాజరయ్యారు. 148 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 98.11గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు వారు తెలిపారు.