News May 3, 2024
శనివారం నాటికి విశాఖకు చేరనున్న బ్యాలెట్ పత్రాలు

ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ శరవేగంగా జరుగుతోంది. జిల్లాలోని 6 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం కోసం 45,350 బ్యాలెట్ పత్రాల ముద్రణ కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయంలో జరుగుతోంది. శనివారం నాటికి బ్యాలెట్ పత్రాలు విశాఖకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ అంతా కర్నూల్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనే జరుగుతుంది.
Similar News
News November 6, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
News November 6, 2025
విశాఖ: 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.
News November 5, 2025
విశాఖ డీసీపీ-1గా మణికంఠ చందోల్ బాధ్యతల స్వీకరణ

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో డీసీపీ-1గా మణికంఠ చందోల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ కాగా తిరిగి ఆయనకే డీసీపీగా పోస్టింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు పలు కార్యక్రమాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలోనూ సఫలీకృతమైన అనుభవం, పరిపాలన పరంగా మంచి నైపుణ్యం ఉంది.


