News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాపై ప్రభుత్వం సీరియస్

శ్రీకాకుళం పట్టణంలో ప్రబలిన డయేరియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఉన్నతస్థాయి నివేదిక తెచ్చుకున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై అధ్యయనం చేస్తోంది. ముందుగా మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసింది. మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ అధికార యంత్రాంగంలో కొనసాగుతోంది. ప్రారంభంలో నియంత్రించలేక పోవటం వల్ల కేసులు పెరిగాయి అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 27, 2026
శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
News February 27, 2026
శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి సీరియస్

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News February 27, 2026
SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


