News February 25, 2026
NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.
Similar News
News March 2, 2026
MBNR: రేపు మన్యంకొండ ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉపాలయాలను మంగళవారం మూసివేయనున్నారు. రేపు ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ద్వారబంధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రహణానంతరం ఆలయ సంప్రోక్షణ చేసి, తిరిగి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News March 2, 2026
వార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వార్ ఎఫెక్ట్‌తో ఈరోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎటర్నల్, L&T, ఏషియన్ పేయింట్స్ షేర్లూ నష్టాల్లో ఉన్నాయి.
News March 2, 2026
SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.


