News February 25, 2026

NZB: ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు

image

ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న NZB ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ వైద్య విద్య సంచాలకుడు (DME) నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డా.అయేషా ఫరీన్, డా.G.స్రవంతి, డా.P.నిశిత, డా.నీలకంఠం సతీశ్ రాజు, డా.R.లక్ష్మణ్, డా.M.అపూర్వ, Dr.P.లీలావతిలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

SRCL: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులను 3 రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహిళా సంఘ భవనాలను పూర్తి చేయాలని, తుది దశలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News March 3, 2026

ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

News March 3, 2026

BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

image

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్‌లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.