News May 3, 2024

అమ్మ పోటీ చేసిన స్థానం నుంచే – 2/2

image

ఈ సీటుకు రెండు టర్మ్‌లు ప్రాతినిధ్యం వహించిన సతీశ్ శర్మ 1998లో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేసి మళ్లీ అమేథీని తిరిగి కాంగ్రెస్ వశం చేశారు. 2004లో ఆ సీటును రాహుల్ గాంధీకి అప్పగించి రాయ్‌బరేలీకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత రాహుల్ అమేథీ నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రాహుల్ రాయ్‌బరేలీలో నిలిచారు. రాహుల్‌కు ముందు ఈ రెండు స్థానాల్లోనూ సోనియా పోటీ చేయడం గమనార్హం. <<-se>>#Elections2024<<>>

Similar News

News July 6, 2025

రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 6, 2025

సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

image

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.

News July 6, 2025

బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

image

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్‌ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.