News February 25, 2026
ఉమమహేశ్వర దేవాలయానికి 1800ఏళ్ల చరిత్ర

అమ్రాబాద్ మండలంలో కొలువుదీరిన పురాతన క్షేత్రం 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామంతుల కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి ‘ఉత్తర ద్వారం’గా వెలుగొందుతున్న ఈ క్షేత్రం చారిత్రకంగానూ ఎంతో విశిష్టతను సంతరించుకుంది.
Similar News
News April 20, 2026
@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.
News April 20, 2026
NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.
News April 20, 2026
సేంద్రియ మేళా సూపర్ హిట్: కలెక్టర్

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.


