News February 25, 2026

కూతుళ్లకు మీరిచ్చే పెద్ద బహుమతి ఇదే!

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులూ ఇది మీకోసమే. మీ ఇంటి మహాలక్ష్ముల భవిష్యత్తు కోసం కేంద్రం ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY) పథకాన్ని అమలుచేస్తోంది. ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే వారి చదువు, పెళ్లి కోసం భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఏటా ₹250 నుంచి ₹1.5లక్షల వరకూ పొదుపు చేయొచ్చు. నెలకు రూ.2వేలు చొప్పున 15ఏళ్లలో రూ.3.6L కడితే 8.2% వడ్డీతో 21 ఏళ్లకు ₹11.08లక్షలు, ₹10k కడితే ₹55.42లక్షలు వస్తాయి.

Similar News

News February 28, 2026

అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

image

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25

News February 28, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. US, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంది. మరోవైపు మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఉద్రిక్తత వేళ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలని పేర్కొంది. కాగా Air India ఇప్పటికే తన సర్వీసులను రద్దు చేసింది.

News February 28, 2026

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి: CM రేవంత్

image

TG: కోకాపేటలోని భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని CM రేవంత్ నిర్ణయించారు. పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇవాళ హరీశ్ రావు సైతం అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. అయితే కేటాయింపు భూముల్లో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని అధికారులపై CM ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి భూముల కేటాయింపు రద్దు చేసి, శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు.