News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.
Similar News
News February 28, 2026
మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.
News February 28, 2026
మెదక్‌లో సినిమా షూటింగ్ సందడి

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.
News February 28, 2026
MDK: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.


