News February 25, 2026

IBPS డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (<>IBPS<<>>) డిప్యూటీ మేనేజర్( AI అప్లికేషన్ డెవలపర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech/MSc/MCA, MTech అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజెస్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ibps.in

Similar News

News February 28, 2026

ఈ ‘1% రూల్’తో సంపదను పెంచుకోండి!

image

పర్సనల్ ఫైనాన్స్‌లో 1% రూల్ సంపదను పెంచే ఒక సింపుల్ స్ట్రాటజీ. దీని ప్రకారం నెలవారీ ఖర్చుల్లో కేవలం 1% తగ్గించుకోవాలి. లేదా మీ సేవింగ్స్‌ను 1% పెంచాలి. చిన్న ఖర్చులను అంటే అనవసర సబ్‌స్క్రిప్షన్లు లేదా అదనపు డైనింగ్ ఖర్చులను కట్ చేసి ఆ మొత్తాన్ని SIP వంటి వాటిలో ఆటోమేట్ చేయాలి. జపాన్ టెక్నిక్ కైజెన్ లాగా ఈ చిన్న మార్పులే లాంగ్ టర్మ్‌లో మీ మీద భారం పడకుండా భారీ సంపదను క్రియేట్ చేస్తాయి.

News February 28, 2026

ఆంథ్రోపిక్‌కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

image

ఆంథ్రోపిక్ AI టెక్నాలజీ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ తమ అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. Claude AI సాఫ్ట్‌వేర్‌లోని సేఫ్‌గార్డ్స్ తొలగించి యుద్ధాల్లో వాడేలా చేయాలన్న పెంటగాన్ ఒత్తిడికి ఆ సంస్థ నిరాకరించడమే దీనికి కారణం. అటానమస్ వెపన్స్ తయారీకి సహకరించలేమని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై మండిపడిన ట్రంప్.. సైన్యం ఎలా పోరాడాలో నిర్ణయించే అధికారం ఒక ప్రైవేట్ సంస్థకు లేదని పేర్కొన్నారు.

News February 28, 2026

పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే..

image

ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్‌ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.