News February 25, 2026

పల్నాడు: వేధింపుల కేసులో కానిస్టేబుల్‌కి రిమాండ్

image

కృష్ణాజిల్లా APSRTCలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేకల నరేంద్రను మంగళవారం నాదెండ్ల పోలీసులు అరెస్టు చేశారు. మండలానికి చెందిన ఓ యువతిని ఆయన వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడడంతో కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్రను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.

Similar News

News February 27, 2026

ఏలూరు జిల్లాలో వైరల్‌గా మారిన ఉద్యోగిని లెటర్

image

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన మెంటల్ కండీషన్ బాగోలేదని లేఖలో రాసినట్లు ఉంది.

News February 27, 2026

పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

image

వ్యాక్సిన్లు పిల్లలను వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక Herd Immunityని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

News February 27, 2026

తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

image

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రింకూ హుటాహుటిన సొంతూరుకు బయలుదేరారు. కొన్ని రోజులుగా ఖచంద్ర లివర్ క్యాన్సర్(ఫోర్త్ స్టేజ్)తో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసి 3 రోజుల కిందటే రింకూ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న మ్యాచ్ సమయానికి మళ్లీ తిరిగి జట్టుతో చేరినా ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు.