News February 25, 2026

నిర్మల్: చిత్తడి నేలల రక్షణే లక్ష్యం: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలోని చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని సూచించారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

Similar News

News February 26, 2026

చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

image

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News February 26, 2026

చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

image

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్‌ ప్రెస్‌ ఆయిల్‌ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు ఉన్నారు.

News February 26, 2026

విజయనగరం: ఇద్దరి మరణానికి కారణమైన లారీ.. ఛత్తీస్‌గఢ్‌లో లభ్యం

image

రామభద్రపురం వద్ద జనవరి 25న ఇద్దరి మరణానికి కారణమైన లారీని ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు ఎట్టకేలకు పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్వస్తిక్ మినరల్స్ లారీగా తేలింది. డ్రైవర్ చోటిలాల్ ప్రమాదం తర్వాత లారీని కంపెనీకి అప్పగించి మధ్యప్రదేశ్ పారిపోయాడు. నిశిత విచారణతో పోలీసులు లారీని ఛత్తీస్‌గఢ్ నుంచి స్టేషన్‌కు తరలించారు.